1. ఆకాశాన అరవై గదులు
గది కొక్క సిపాయి
సిపాయి కొక్క తుపాకీ
2. తామర కమలం మీద కాలువ పువ్వులు
కలువల కింద సంపెంగ పువ్వు
సంపెంగ కింద దొండ పళ్ళు
పళ్ళు లో మల్లె మొగ్గలు
3. ఐదుగురు పట్టంగ
ముప్పై ఇద్దరు రుబ్బంగ
ఒకడు తొయ్యంగా
గుండు వెళ్ళి గుండ్రావతిలో పడింది
4. పల్లాన పండింది
మెరకన ఎండింది
వాడి కుప్ప కాలింది
వాడి అప్పు తీరింది
5. వంకర టింకర పోతుంది పాము కాదు
దారి పొడుగునా దాహం తీరుస్తుంది తాబేటి కాయ కాదు
కొండ కొనల్లొ తిరుగుతుంది జంతువు కాదు
సముద్రం లో మునుగుతుంది కానీ చేప కాదు
6. నల్లటి కుక్కకు నాలుగు చెవులు
7. కాళ్లు లేవు గానీ నడుస్తుంది.
కళ్లు లేవు గానీ ఏడుస్తుంది
8. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర
9. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది
10. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
విడుపులు
1. తేనె పట్టు
2. ముఖం, కళ్ళు, ముక్కు, పెదవులు, పళ్ళు
3. అన్నం ముద్ద
4. కుండ, కుమ్మరి
5. నది
6. లవంగం
7. మేఘం
8. కుండలో గరిటె.
9. తాటిచెట్టు
10. ఉంగరం
No comments:
Post a Comment