1. మెరిసే కళ్ళు , తళ తళ లాడే కళ్ళు,
కళ్ళు సుందరమే కానీ కనపడని కళ్ళు
2. గాలికి ఆరని దీపం
3. నన్ను చూస్తే నిన్ను పట్తిస్తా
4. నీరు తగిలితే గుప్పెడు అవుతుంది
ఎండ తగిలితే గంపేడు అవుతుంది
5. గూటిలో ఉంటాము గువ్వలం కాదు
మా చుట్టూ కాపలా రాజులం కాదు
న్యాయం ధర్మం తెలుసు న్యాయ మూర్తులం కాదు
మరి మేమేవరం?
6. కాళ్ళు చేతులు లేకుండా కదిలేది
7. మా రాజా వారి తోటలో రెండు రోజపూలు
చూసే వారే కానీ కోసే వారు లేరు
8. తింటే కరకర చూస్తే గజిబిజి
9. ఐదు అక్షరాల మహారాజు కి మూడు అక్షరాల ముద్దుల యువరాజు
మూడు అక్షరాల ముద్దుల యువరాజుకి రెండక్షరాల పాల రాణి
10. గొరువంకకు గొడుగు పట్టేదేవరు
విడుపులు
1. నెమలి కళ్ళు
2. సూర్యుడు
3. అద్ధం
4. పత్తి
5. కళ్ళు
6. చేప
7. సూర్య చంద్రులు
8. జంతిక
9. దశరధుడు, శ్రీ రాముడు, సీత
10. ఆకాశం
No comments:
Post a Comment