1. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు
కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు
అన్ని పువ్వుల్లో రెండే కాయ
2. ముప్పై ఇద్దరి మధ్యన రాకుమారి నాట్యం చేసే
3. మూత తెరిస్తే ముత్యాల పేరు మూత మూస్తే రత్నాల భరిణె
4. జీవం లేని జంతువు ఆకుల్లేని అడవిలో వేటాడబోయింది
5. ఎర్రని కోటలో తెల్లని భటులు
6. దినమంతా నిద్రపోతుంది రాత్రుళ్ళు మేలుకుంటుంది
7. తోలు నలుపు తింటే పులుపు
8. చేసేటప్పుడు మెత్తగా వాడే ముందు గట్టిగా వాడాక పొడిగా ఉండెదేమిటి?
9. జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు
10. జాణెడు బుట్టలో ఎర్రని పగడాలు
విడుపులు
1. సూర్యుడు, చంద్రుడు
2. నాలుక
3. పళ్ళు, నోరు
4. దువ్వెన
5. పళ్ళు
6. దీపం
7. చింత పండు
8. పిడక
9. చెప్పులు, మనిషి
10. పొయ్యి, నిప్పులు
No comments:
Post a Comment