Showing posts with label Podupu Kathalu. Show all posts
Showing posts with label Podupu Kathalu. Show all posts

Feb 21, 2013

Podupu Kathalu (Telugu Riddles) - 14



1. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.

2. పండ్లు ఉన్నా నోరు లేనిది?


3. ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు.

    మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు.

4.  ఇంటింటికీ ఒక నల్లోడు


5. అందరికి ఒకే కొడుకు, ఒకే కూతురు


6.  అమరా దేశం నుండి కొమరా పళ్ళు వస్తే,

    కొనే వాళ్ళే గాని తినే వాళ్ళు లేరు. 

7. ఆకాశ గిర గిర, నేలకు ఢాం

   రాతికి రంగం, నోటికి సైతాన్

8.  ఎనిమిది కాళ్ళు, నాలుగు కొమ్ములు, అడ్డంగా నడుచు, 

    అసుర కాదు, శిరస్సు తోక లేదు, జీవం మాత్రం ఉంది. 

9. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు


10. ఆకు పచ్చ, కాయ వగరు, పండితే తీపి



విడుపులు

1. పుట్ట


2. రంపం.


3. విమానం


4. మసిగుడ్డ


5. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు


6. పగడాలు


7. కొబ్బరి కాయ


8. పీత


9. వడగళ్ళు


10. అరటి పండు


Podupu Kathalu (Telugu Riddles) - 13



1. గాలి జీవనం కళ్ల మద్య పావనం

2. చారల పాపడికీ దూదంటి కుచ్చు


3. నూరు చిలుకలకు ఒకటే ముక్కు


4.  ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే


5. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.


6.  చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?


7. తొడిమ లేని పండు, ఆకులేని పంట.


8.  పైడిపెట్టెలో ముత్యపు గింజ


9. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది


10. అరం కణం గదిలో 60 మంది నివాసం



విడుపులు

1. ముక్కు


2. ఉడుత


3. ద్రాక్ష


4. ఉల్లిపాయ


5. నిప్పు


6. టెంకాయ


7. విభూది పండు, ఉప్పు


8. వడ్లగింజ


9. గొడ్డలి


10. అగ్గిపెట్టె, పుల్లలు


Feb 1, 2013

Podupu Kathalu (Telugu Riddles) - 12



1. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?

2. తలపుల సందున మెరుపుల గిన్నె.


3. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు,

    కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,
   అన్ని పువ్వుల్లొ రెండే కాయలు ఏమిటది?

4. పైనో పలకా,

   కిందో పలకా,
   పలకల మధ్యా మెలికల పాము?

5. ఎండిన బావి లో

    పిల్లల గెంతులు

6.  శివరాత్రి కి జీడికాయ

    ఊగాదికి ఊరగాయ

7. కోస్తే తెగదు కొడితే పగలదు

8. ఒక పిల్లకు ఎన్ని గౌన్ లు విప్పిన కొద్ది వస్తూనే ఉన్నాయి


9. అంగట్లో పెట్టి అమ్మెది కాదు

    తాక్కెటిలో పెట్టి తూచేడి కాదు
    అది లేకుంటే పండుగే లేదు 

10. చక్కని చెంబు చారల చెంబు

     ముంచితే మునగని ముత్యాల చెంబు


విడుపులు

1. మేఘం


2. దీపం


3. ఆకాశం,చుక్కలు,సూర్యుడు.


4. నాలుక.


5. పాప్ కార్న్, పేళాలు


6. మామిడి కాయ


7. నీడ


8. ఉల్లిపాయ


9. ఆవు పేడ


10.  దోసకాయ


Jan 31, 2013

Podupu Kathalu (Telugu Riddles) - 11



1. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?

2. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?


3. ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు


4. అడ్డ గోడ మీద పూజారప్ప


5. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?


6.  ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న


7. పొంచిన దెయ్యం,  పోయిన చోట ప్రత్యక్షం


8.  అడ్డం గా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం


9. ఒక అడవి ఆ అడవిలో ఒకే చెట్టు

    అది రోజూ ఊగక పోతే మనందరికీ రోజు గడవదు

10. వేస్తాము ర... తీస్తాము రా..

      వాసన చూస్తామురా..
      ఒకరికొకరు రాసుకుంటాము రా


విడుపులు

1. నత్త


2. పత్తి కాయ.


3. సూర్యుడు, చంద్రుడు.


4. తేలు


5. ఆకలి


6. వెలగపండు


7. నీడ


8. ఉల్లిపాయ


9. నాలుక


10. గంధం , చెక్క


Jan 30, 2013

Podupu Kathalu (Telugu Riddles) - 10



1. తన్ను తానే మింగి, మాయమవుతుం

2. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది


3. పొడవాటి మానుకి నీడే లేదు


4. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి


5. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు


6.  అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమామ.


7. ఆకాశాన పటం.. కింద తోక


8.  అడవిలో పుట్టింది.

     అడవిలొ పెరిగింది
     మా ఇంటికొచ్చింది ,
     మహాలక్షిమిలాగుంది ఏమిటది?

9. గుడి నిండా నీళ్ళు, గుడి చుట్టూ తాళం


10. అంగడి నుండి తెచ్చే ముందర పెట్టుకు ఏడ్చే




విడుపులు

1. మైనపు వత్తి


2. నీడ


3. దారి


4. ఉంగరం


5. సూది


6. చందమామ


7. గాలిపటం


8. గడప


9. కొబ్బరికాయ


10. ఉల్లిపాయ


Jan 29, 2013

Podupu Kathalu (Telugu Riddles) - 9



1. ఎందరు ఎక్కిన విరగని మంచం.

2. దాస్తే పిడికిలిలో దాగుతుంది,

    తీస్తే ఇల్లంతా జారుతుంది.

3. తొలుతో చేస్తారు. 

   కర్రతో చేస్తారు. 
   అన్నం పెడతారు, 
   అదే పనిగా బాదుతారు?

4. అడ్డగోడమీద బుడ్డ చెంబు, 

    తోసినా  ఇటుపక్క పడదు. 
    అటు పక్క పడదు.

5. బంగారు చెంబులో వెండి గచ్చకాయ


6. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, 

    రాజుల మెచ్చిన రత్నాల ఆకు?

7. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టలేదు. 

    కళ్లున్నాయి చూపులేదు

8.  పుట్టెడు శనగలలో ఒకటే రాయి ఏమిటది


9. ఆకాశంలో 60 గదులు,

    గదిగదికో సిపాయి, 
    సిపాయికో తుపాకి

10. ముక్కు మీది కెక్కు,

      ముదర చెవులు నొక్కు ,
      టక్కు నిక్కుల సొక్కు,
      జారిందంటే పుటుక్కు?



విడుపులు

1. అరుగు.


2. దీపం వెలుగు.


3. మద్దెల


4. ఆబోతు మూపురం


5. పనసతొన.


6. తమలపాకు


7. కొబ్బరి కాయ


8. చందమామ.


9.  తేనె పట్టు


10. కళ్ళజోడు.


Jan 28, 2013

Podupu Kathalu (Telugu Riddles) - 8



1. గూబ గూటిలో తోక చేతిలో

2. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి


3.దాని పువ్వు పూజకు రాదు.

   దాని ఆకు దొప్పకు రాదు, 
   దాని పండు అందరు కోరు?

4. ఆకే లేదు నీరుతాగదు. 
    నేలని పాకదు.
    ఏమిటి ఆ తీగ

5. తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు

    చేతితో చల్లడం,నోటితో ఏరుకొవడం ఏమిటది?

6. అత్తరు పన్నీరు గురుగురులు
    దాని దగ్గరాలు పోతే లబలబలలు

7. ఆకు లేని పంట అరవై ఆరు పుట్లు


8.  గుండ్రంగా ఉంటాను భూమిని కాను

     నల్లగా ఉంటాను బొగ్గును కాను
     మాట్లాడతాను మనిషిని కాను

9. చిటారు కొమ్మన మిటాయి పొట్లం


10. అడవిలో మాను ఎంత కోసిన ఎదుగుతూనే ఉంటుంది




విడుపులు

1. గరిటె


2. దీపం


3. చింతపండు


4. విద్యుత్తు తీగ


5. పుస్తకం.


6. మొగలి పువ్వు


7. ఉప్పు మడి


8. గ్రామఫోన్ రికార్డ్


9.  తేనె పట్టు


10. జుట్టు


Dec 28, 2012

Podupu Kathalu (Telugu Riddles) - 7



1. పోకంత పొట్టి వాడు
   ఇంటికి మాత్రం గట్టి వాడు

2. 
వాన లేక ఎండా లేక పైరు పచ్చంగా 
   ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా

3.
పూజకు పనికి రాని పువ్వు
  పడతులు మెచ్చే పువ్వు

4. వెయ్యిమంది కూలీలు కలిసి

    అందమైన ఇల్లు కట్టె
    ఒక్కడి కను చూపు తగిలి
    పొయెనే ఆ ఇల్లు కరిగి

5. రాజు గారి తోటలో

    రోజా పూలు
   చూసే వారే కానీ
   కోసే వారు లే

6. నల్లటి చేలో తెల్లటి దారి

    ఆ దారి లో నల్లటి దెయ్యం వెళ్తుంది

7. అంగట్లో ఉంటాను

    అంగీ విప్పుతాను
    ఎవరైన పట్టుకుంటే
    నోట్లో దూకుతాను

8. ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు


9. ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర


10. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?





విడుపులు

1. 
తాళం కప్ప

2. 
రామచిలుక

3. 
మొగలిపువ్వు

4. గడ్డం


5. నక్షత్రాలు


6.  పేను


7.  అరటిపండు


8. కల్లు కుండలు


9. పుట్టగొడుగులు


10.  తమలపాకు


Podupu Kathalu (Telugu Riddles) - 6



1. మెరిసే కళ్ళు , తళ తళ లాడే కళ్ళు,
    కళ్ళు సుందరమే కానీ కనపడని కళ్ళు

2. గాలికి ఆరని దీపం


3. నన్ను చూస్తే నిన్ను పట్తిస్తా


4. నీరు తగిలితే గుప్పెడు అవుతుంది

    ఎండ తగిలితే గంపేడు అవుతుంది 

5. గూటిలో ఉంటాము గువ్వలం కాదు

    మా చుట్టూ కాపలా రాజులం కాదు
    న్యాయం ధర్మం తెలుసు న్యాయ మూర్తులం కాదు
    మరి మేమేవరం?

6. కాళ్ళు చేతులు లేకుండా కదిలేది


7. మా రాజా వారి తోటలో రెండు రోజపూలు

    చూసే వారే కానీ కోసే వారు లేరు

8. తింటే కరకర చూస్తే గజిబిజి

9. ఐదు అక్షరాల మహారాజు కి మూడు అక్షరాల ముద్దుల యువరాజు

    మూడు అక్షరాల ముద్దుల యువరాజుకి రెండక్షరాల పాల రాణి

10. గొరువంకకు గొడుగు పట్టేదేవరు







విడుపులు

1. నెమలి కళ్ళు


2.  సూర్యుడు


3. అద్ధం


4. పత్తి


5. కళ్ళు


6.  చేప

7.  సూర్య చంద్రులు


8. జంతిక


9.  దశరధుడు, శ్రీ రాముడు, సీత


10. ఆకాశం


Dec 13, 2012

Podupu Kathalu (Telugu Riddles) - 5



1. ఆకాశాన అరవై గదులు
    గది కొక్క సిపాయి
    సిపాయి కొక్క తుపాకీ

2. తామర కమలం మీద కాలువ పువ్వులు

    కలువల కింద సంపెంగ పువ్వు
    సంపెంగ కింద దొండ పళ్ళు
    పళ్ళు లో మల్లె మొగ్గలు

3. ఐదుగురు పట్టంగ 

    ముప్పై ఇద్దరు రుబ్బంగ
    ఒకడు తొయ్యంగా 
    గుండు వెళ్ళి గుండ్రావతిలో పడింది

4. పల్లాన పండింది 

    మెరకన ఎండింది
    వాడి కుప్ప కాలింది 
    వాడి అప్పు తీరింది

5. వంకర టింకర పోతుంది పాము కాదు

    దారి పొడుగునా దాహం తీరుస్తుంది తాబేటి కాయ కాదు
    కొండ కొనల్లొ తిరుగుతుంది జంతువు కాదు
    సముద్రం లో మునుగుతుంది కానీ చేప కాదు

6. నల్లటి కుక్కకు నాలుగు చెవులు


7. కాళ్లు లేవు గానీ నడుస్తుంది.

   కళ్లు లేవు గానీ ఏడుస్తుంది

8. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర


9. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది


10. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.







Dec 12, 2012

Podupu Kathalu (Telugu Riddles) - 4



1. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు
    కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు
    అన్ని పువ్వుల్లో రెండే కాయ

2. ముప్పై ఇద్దరి మధ్యన రాకుమారి నాట్యం చేసే

3. మూత తెరిస్తే ముత్యాల పేరు మూత మూస్తే రత్నాల భరిణె


4. జీవం లేని జంతువు ఆకుల్లేని అడవిలో వేటాడబోయింది

5. ఎర్రని కోటలో తెల్లని భటులు


6. దినమంతా నిద్రపోతుంది రాత్రుళ్ళు మేలుకుంటుంది


7. తోలు నలుపు తింటే పులుపు

8. చేసేటప్పుడు మెత్తగా వాడే ముందు గట్టిగా వాడాక పొడిగా ఉండెదేమిటి? 

9. జోడు గుర్రాల మీద ఒక్కడే రాజు


10. జాణెడు బుట్టలో ఎర్రని పగడాలు








విడుపులు

1. సూర్యుడు, చంద్రుడు


2.  నాలుక


3. పళ్ళు, నోరు


4. దువ్వెన


5. పళ్ళు


6.  దీపం


7.  చింత పండు


8. పిడక


9. చెప్పులు, మనిషి


10. పొయ్యి, నిప్పులు


Dec 11, 2012

Podupu Kathalu (Telugu Riddles) - 3


1. ఎనిమిది ఎముకలు గంపేడు పోగులు

2. ఎర్రని పండు తినాలేం కొరకాలేం

3. గుప్పెట్లో ఇద్దరు దొంగలు


4. అంగుళం ఆకు అడుగున్నర కాయ

5. గుప్పెడు గువ్వకు మూరెడు తోక


6. రెండు నల్లని కొండల మధ్యన చిన్న పిల్లవాడు

7. మా అమ్మ మీ అమ్మ ఒకరే

8. చారల పాము చక్కని పాము చెట్లలో వేలాడే పాము

9. భుజం మీద ఉంటుంది లేదా దండేం మీద ఉంటుంది

10. బొగ్గులు తింటుంది, 
     బుగ్గల నిండా పొగ వీడుస్తుంది 
     పరుగులు తీస్తుంది





విడుపులు

1. మంచం

2. నిప్పు

3. వేరు శనగ కాయ

4. మునగ కాయ

5. కలువ పువ్వు

6.  పేను

7. తులసమ్మ

8. పొట్లకాయ

9. కండువా

10. రైలు బండి






Dec 10, 2012

Podupu Kathalu (Telugu Riddles) - 2


1. అడవిలో పుట్టింది 
      అడవిలో పెరిగింది 
     మా ఇంటికొచ్చింది 
     మహాలక్ష్మి లా ఉంది

2. భూమాతకు ముద్దు బిడ్డ
      ఆకాశపు జున్ను బిడ్డ
      పగలైతే పేదరికం
      రాత్రి ఐతే రాజరికం 

3. తెల్లని ఒళ్ళు, ఎర్రని ముక్కు,
    పొడుగ్గా పుడుతుంది 
    పొట్టిగా పెరుగుతుంది

4. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. 
      కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. 
      పాకిపోవుచుండు పాము కాదు

5. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. 
    నరవాహనము లేక నడిచిపోలేదు. 
    తనకు జీవం లేదు, జీవుల్ని చంపు





విడుపులు


1. గడప

2. చందమామ

3. కొవ్వొత్తి

4. రైలు

5. వల


Nov 28, 2012

Podupu Kathalu (Telugu Riddles) - 1

1. ఒకటి కొడుతుంది,
ఇంకొకటి  పడుతుంది,
వేరోకటి పెడుతుంది

2. గుడి లోన తెల్లన గుడి వెనుక నల్లన.  

3. రెక్కల భామల చక్కని నగరు
గదులు గదులు గల గుమ్మన నగరు
మధుర మధురమగు మధురా నగరు
నగరు సంపత్తి నరుల కర్పితం

4. తల్లి దయ్యం, పిల్ల పగడం.   

5. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు.
నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు,
తంతే తన్నింది గాని కాలు లేదు.




విడుపులు


1. ఎండ, వాన, చలి

2. కొబ్బరి కాయ

3. తేనెపట్టు

4. రేగుపండు

5.అద్దం