1. గూబ గూటిలో తోక చేతిలో
2. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి
3.దాని పువ్వు పూజకు రాదు.
దాని ఆకు దొప్పకు రాదు,
దాని పండు అందరు కోరు?
4. ఆకే లేదు నీరుతాగదు.
నేలని పాకదు.
ఏమిటి ఆ తీగ
5. తెల్లటి పొలంలో నల్లని విత్తనాలు
చేతితో చల్లడం,నోటితో ఏరుకొవడం ఏమిటది?
6. అత్తరు పన్నీరు గురుగురులు
దాని దగ్గరాలు పోతే లబలబలలు
7. ఆకు లేని పంట అరవై ఆరు పుట్లు
8. గుండ్రంగా ఉంటాను భూమిని కాను
నల్లగా ఉంటాను బొగ్గును కాను
మాట్లాడతాను మనిషిని కాను
9. చిటారు కొమ్మన మిటాయి పొట్లం
10. అడవిలో మాను ఎంత కోసిన ఎదుగుతూనే ఉంటుంది
విడుపులు
1. గరిటె
2. దీపం
3. చింతపండు
4. విద్యుత్తు తీగ
5. పుస్తకం.
6. మొగలి పువ్వు
7. ఉప్పు మడి
8. గ్రామఫోన్ రికార్డ్
9. తేనె పట్టు
10. జుట్టు
No comments:
Post a Comment