1. తన్ను తానే మింగి, మాయమవుతుం
2. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది
3. పొడవాటి మానుకి నీడే లేదు
4. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి
5. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు
6. అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమామ.
7. ఆకాశాన పటం.. కింద తోక
8. అడవిలో పుట్టింది.
అడవిలొ పెరిగింది
మా ఇంటికొచ్చింది ,
మహాలక్షిమిలాగుంది ఏమిటది?
9. గుడి నిండా నీళ్ళు, గుడి చుట్టూ తాళం
10. అంగడి నుండి తెచ్చే ముందర పెట్టుకు ఏడ్చే
విడుపులు
1. మైనపు వత్తి
2. నీడ
3. దారి
4. ఉంగరం
5. సూది
6. చందమామ
7. గాలిపటం
8. గడప
9. కొబ్బరికాయ
10. ఉల్లిపాయ
No comments:
Post a Comment